Tuesday, October 8, 2013

Internetలో తెగులుదనం


కాస్త బుద్దెరిగాక నాకు ఎవరైనా సింహభాగం అంటే చాలా కోపం వచ్చేది. Lions Shareను స్వేచ్చగా తెలుగులోకి అనువదించడానికి బదులు తెలుగును వధించి ఉన్నదున్నట్టు తెలుగులోకి మార్చి ఈ సింహభాగాన్ని  తయారుచేసారు కానీ సింహభాగం అన్నపదానికి తెలుగులో అర్ధంలేదు అని మా తెలుగు పంతులు చెప్పినప్పటినుండి నాకు ఆ పదం మీద మంట. చక్కగా తెలుగులో ఎక్కువ భాగం అని అనొచ్చుకదా అని అనుకునేవాన్ని. ఆకాలంలో ఒకటో అరో పదాలు ఇలా ఉండేవి కానీ ఈ Internet యుగంలో తెలుగుకు పూర్తిగా తెగులు పటిస్తున్నారు, అది చూసి నాకైతే విసుగొచ్చేస్తుంది. Gmailను తెలుగులో తెరిచి చూస్తే, “మీ ఖాతాను ప్రాప్యత చేయలేకపోతున్నారా?” అంటుంది. ఇంతకు వాడు ఏమి అడుగుతున్నాడో మీకు అర్ధమయ్యిందా? Can't access your account? అని అడుగుతున్నాడు. ఇది కేవలం ఒక మచ్చు తునక. internet sitesను తెలుగు అనువాదంలో తెరిచి చూస్తే వాటిలో తెలుగు కనిపించదు తెగులు కనిపిస్తుంది.

అసలు సమస్య ఎలా వచ్చిందంటే internetలో భాషాంతరం చేసినవాళ్ళతో. అనువాదాలన్ని గత పదేళ్ళలో స్వచ్ఛందంగా చేయబడినవే అని మనకందరికి తెలుసు.   కాలంలో Internet, Telugu Unicodeలు పరిచయం ఉన్నవాళ్ళే అనువాదం చేసారు. వీళ్ళంతా ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నవాళ్ళే.  వీళ్ళ తెలుగు ఎంత గొప్పగా ఉంటుంది అనడానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతా. మా కాలేజీలో ర్యాగింగ్ జరుగుతున్నప్పుడు ఒకడు వచ్చినీది యానకం’ అని అడిగాడు. యానకం ఏంటి అని అడిగితే 'వెధవ తెలుగు మీడియంలో చదువుకున్నావ్, యానకం అంటే తెలీదా. యానకం అంటే మీడియంరా వెధవా' అన్నాడు. వాడి తెలుగు పరిజ్ఞానానికి నా తలతిరిగి నేను 'నీకు నీ తెలుగుకు దండం, మీడియం అంటే యానకం కాదురా దరిద్రుడా, మీడియం అంటే మాధ్యమం రా' అనుకున్నా మనసులో, బయటికి అంటే తంతాడు కనుక. వీడిలాంటివాళ్ళు తెలుగులోకి భాషాంతరం చేస్తే మన పరిస్థితి ఇలాగే ఉంటుంది. వీళ్ళ తెలుగు భాషాభిమానం ఎంత అంటే, వాళ్ళు ఎప్పుడు, I like Telugu so much, I love Telugu, Telugu is a beautiful language, There is no language sweeter than Telugu అని అంటుంటారు ఆంగ్లంలో.

వీళ్ళకు తెలుగే సరిగా రాదు, పైగా మూర్ఖత్వం చాలా ఎక్కువ. వీళ్ళతో వాదించి ప్రయోజనం శూన్యం. అడ్డమైన వాదన చేస్తారు. Computer ను తెలుగులో ఏమంటారు, calculator ను తెలుగులో ఏమంటారు, apple ను తెలుగులో ఏమంటారు. లాంటి ప్రశ్నలు వేస్తారు. ఇక దానికి వాళ్ళ మూర్ఖత్వంతోడై విపరీత తెలుగు పదాలు తయారు చేస్తారు. అది తెలుగులా ఉండదు తెగులులా ఉంటుంది. ఒకడు నాతో మూతి పుస్తకంలో కలుస్తా అంటే, వాడితో నీ మూతి పగలగొడతా అని చెప్పా. నేను చూసిన అతి దరిద్రమైన అనువాదం ఏంటంటే ఒకడు ఆర్కుట్కమ్యూనిటిలో 'ఇక్కడ నరకం పోతుంది' అని వేసాడు. వాడు ఏమంటున్నాడో అర్థమయ్యాక ఆక్షణం నాకు జీవితం మీద ఆశ చచ్చిపోయింది. ఇంతకి వాడు ఎమన్నాడంటే, ‘What the hell is going on here.’ వాడిలో ఉన్న తెలుగులో మాట్లాడాలనే కోరికను అభినందించాలో లేక వాడి మూర్ఖత్వాన్ని నిందించాలో అర్థంకాలేదు నాకు. Internetలో మనకు ఇలాంటి మహానుభవులు ఎందరో కనిపిస్తారు.

ప్రతి భాషకు ఒక పద సంపద ఉంటుంది, పద సంపదలో భాష ఏర్పడే నాడు ఉన్న విషయాలు, వస్తువులకు సంబంధించిన పదాలే ఉంటాయి. అలాగే ప్రతి భాషకు ఒక వ్యాకరణం ఉంటుంది. తెలుగుకు కూడా పదజాలం ఉంది వ్యాకరణం ఉంది. పదజాలంలో Computer లాంటి నవీన పదాలు ఉండవు, ఎందుకంటే అవి తెలుగు ఏర్పడిననాడు లేవు కనుక. వాటిని యాధాతదంగా వాడితే తప్పేమీ లేదు. వాటిని ప్రత్యేకించి తెలుగులోకి అనువదించాల్సిన అవసరం లేదు. కొన్ని దశాబ్దాలనుండి busను తెలుగులో బస్సు అనే అంటున్నాం, carను తెలుగులో కారు అనే అంటున్నాం. వాటిని ప్రత్యేకించి ఏనాడూ తెలుగులోకి అనువదించలేదు. అలాగే ఈనాటి కొత్త సాంకేతికపదాలను తెలుగులోకి అనువదించాల్సిన అవసరంలేదు. తెలుగు వ్యాకరణంలో అన్యదేశ్య పదాలకు చోటుంది. ప్రతి భాషలో పక్క భాషనుండి కొత్తపదాలు కలవాల్సిందే, అలా కలిస్తేనే భాష అభివృద్ది చెందుతుంది. అందుకు ఆంగ్ల భాషే చక్కని ఉదాహరణ. ముందు మనం తెలుగులో ఉన్న పదాలను తెలుసుకుని, వాటిని వాడి కాపాడుకుందాం. మనం బ్రతికించి భావితరాలకు అందించవలసిన పదాలివి. తరువాత అవసరమనిపిస్తే తెలుగులో లేని పదాల్ని తయారుచేసుకోవచ్చు. నిజంగా కొత్త పదాల ఆవశ్యకత ఉంటే భాషా పడితులచే వాటి సృష్టి చేయించాలే కానీ ఎవడికి తోచినట్టు వాడు తెగులు పట్టించకూడదు. మధ్య కాలంలో తెలుగులో చేరిన పదాల్లో నాకు నచ్చిన పదం చరవాణి. చాలా అందంగా ఉంది, భావాన్ని అనువదించారు కానీ పదాల్ని అనువదించలేదు. అలాగే ఆంగ్ల వాక్యాన్ని తెలుఫులోకి అనువదించేటప్పుడు, వాక్యాన్ని యధాతదంగా తెలుగులోకి మూర్ఖానువాదం చెయ్య కూడదు. ఆంగ్ల వ్యాకరణాన్ని తెలుగులోకి దించకూడదు. ఆంగ్ల వాక్యపదాలను ఉన్నదున్నట్టు తెలుగులోకి మార్చకూడదు, తెలుగు వ్యాకరణానికనుగుణంగా స్వేచ్చానువాదం చేయాలి. అందుకోసం ముందు మనం తెలుగు నేర్చుకోవాలి. అలా చెయ్యకుంటే internetలో ఉండేది తెగులే.

7 comments:

  1. I second you on this. Good post !
    Hope people who developed or developing this kind of telugu reads this

    ReplyDelete
  2. Super..chaala chakkaga chepparu.

    ReplyDelete
  3. తెగులు అంటుకోకుండా తెలుగు నేర్చుకుందాం :-) మంచి పోస్ట్( Good post కి అనునువాదం సరైనదేనా?)

    ReplyDelete
  4. Good one.. ee gmail loni 'praapyata' ni ardham chesukotaniki chala kaalame pattindandoi naku kuda.

    ReplyDelete
  5. Very logical and truth implified.

    ReplyDelete