Sunday, October 13, 2013

బట్టా బట్టా ఎందుకు ఆరలేదు


పొద్దున లేవగానే క్లయింట్ మీటింగ్ ఉందని గుర్తొచ్చింది. కానీ రాత్రి బట్టలు ఉతకలేదు. క్లయింట్ మీటింగ్‌ అంటే దానికి తగినట్టుగా వస్త్ర ధారణ ఉండాలి మరి. చూడటానికి బుద్దిగా రాముడు మంచిబాలుడులా కనిపించాలి. రాత్రి బట్టలు ఉతకలేదు,మనదగ్గర ఉతికిన బట్టలే లేవు. మరి ఇప్పుడెలా? కంగారు పడాల్సిన అవసరమే లేదు. మన వాషింగ్ మషిన్ ఉందిగా. వెళ్ళి అందులో ఓ డ్రెస్ పడేసి, అరగంట తరువాత తీసి డ్రయ్యర్‌లో వేసి, ఇంకో గంటతరువాత వెళ్ళి చూస్తే బట్టలు ఆరలేదు. ఇప్పుడెలా?

బట్టా బట్టా ఎందుకు ఆరలేదు అంటే  .. డ్రయ్యర్ ఆరబెట్టలేదు అంది.
డ్రయ్యర్ డ్రయ్యర్ ఎందుకు ఆరబెట్టలేదు అంటే .. మోటర్ తిరగలేదు అంది.
మోటర్ మోటర్  ఎందుకు తిరగలేదు అంటే ... వైరింగ్ కాలిపోయింది అంది..
వైరింగ్ వైరింగ్ ఎందుకు కాలిపోయావు అంటే .. కరంట్ షర్ట్ సర్క్యూట్ అయ్యింది అంది
కరంట్ కరంట్ ఎందుకు షర్ట్ సర్క్యూట్ అయ్యావు అంటే .. నా బంగారు ప్లగ్గులో వైరుపెడితే షర్ట్ సర్క్యూట్ అవ్వనా అంది.

వేరే డ్రయ్యర్‌లో వేసే టైం ఉందా లేదా అని రూంకొచ్చి టైంకోసం చూస్తే మొబైల్ చార్జ్ అవలేదు

మొబైల్ మొబైల్ ఎందుకు చార్జ్ అవలేదు అంటే .. డ్రయ్యర్‌కో న్యాయం నాకో న్యాయమా?
అది పాడయితే నేను కూడా పాడవనా అంది...

ప్లాన్ చేంజ్ ... గత వారంగా వేసుకుంటున్న మాసిన బట్టలే వేసుకుని క్లయింట్ మీటింగ్ వెళ్ళాలి ...
క్లయింట్ మీటింగ్‌కు అంత ప్రాముఖ్యత ఇవ్వనవసరంలేదు... వాడు మనలా మనిషే కదా.....

5 comments:

  1. hehe..mari meeko nyayam mee client ko nyayama..valla intlo current poda..idi mare ananyam andi..

    ReplyDelete
  2. chinnaga chakkaga undi

    ReplyDelete
  3. మొబైల్ మొబైల్ ఎందుకు చార్జ్ అవలేదు అంటే .. డ్రయ్యర్‌కో న్యాయం నాకో న్యాయమా? Ha Ha :-) అంతేగా మరి

    ReplyDelete
  4. Mari aye perfume vadaro adhe kudha cheypandi :-)

    ReplyDelete
  5. Dryer ki oka nyayam, nako nyayma ... LOL!!

    ReplyDelete