Monday, December 17, 2012

ఎలా పలకను?

ఆంగ్ల భాష పదాలకు ఒక పద్దతి పాడు అంటూ లేదు. ఒక్కో పదానికి ఒక్కో spelling, ప్రతి పదానికి ఉచ్చారణ, spelling రెండు ప్రత్యేకంగా నేర్చుకోవలసిందే, ఒక నియమం అంటూ లేదు. కానీ తెలుగు అలా కాదు, ఎలా రాస్తామో అలా పలుకుతాం, ఎలా పలుకుతామో అలా రాస్తాం అని అనుకుంటాం కదా. కానీ, తెలుగులో ఉచ్చరించే విధానం రాసే విధానం వేరు వేరుగా ఉన్న పదాలు చాలా ఉన్నాయి. అవి నన్ను మకతిక పెడుతూనే ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నా దృష్టిని ఆకర్షించిన పదంబ్రహ్మ’. నేను అయిదవ తరగతిలో ఉన్నప్పుడు అనిపించింది,ఏంటిది? దీన్ని మనం ఇలా పలుకుతున్నాం? రాసినట్టు పలకటంలేదే’ అని.

ఈ ఉల్లేఖనంలో, ముందుకెళ్ళేముందు ఒక్కసారి మీరుబ్రహ్మ’ను ఉచ్చరించండి. ఎలా ఉచ్చరించారు? బ్రహ్ అనా? లేక బ్రమ్ అనా? మనలో దాదాపుగా అందరం బ్రమ్ అనే పలుకుతాం. అవునా? కాదా? బ్రమ్ అని పలకాలంటే బ్రమ్హ అనో లేక బ్రంహ అనో రాయాలి కానీ బ్రహ్మ అని రాయడం ఏంటి? బ్రహ్మ అని రాస్తే బ్రహ్ అని పలకాలి కదా. మకతిక ఏంటబ్బా? ఇంకొంతమంది మరీ దారుణంగా బ్రమ్మ అని పలుకుతారు. (ఉదా: బ్రహ్మానందాన్ని బ్రమ్మానందం అంటారు.) ఇంతకి ఏమని ఉచ్చరించాలి? బ్రహ్ అనా? బ్రమ్ అనా? లేక బ్రమ్ అనా?

మకతిక మన తెలుగులోనే కాదు, దాదాపుగా అన్ని భాషల్లో ఉంది. నేను చాలా భాషలు పరిశీలించా, అన్నింట్లో ఇదే సమస్య. కన్నడ, హింది, గుజరాతి, మరాఠీ భాషల లిపులన్నింటిలో సమస్య ఉంది. సమస్య ఎక్కడినుండొచ్చిందబ్బా? బ్రహ్మ సంస్కృత పదం కదా, ఇదేదో సంస్కృతం నుండీ వచ్చిన సమస్య అనుకుంటా. దేవనాగరిలో కూడా, బ్రహ్మ అనే రాస్తారు. అక్కడినుండి అన్ని భాషల్లో చేరిందీ సమస్య. అంతెందుకు నిన్న మొన్న భారత దేశంలోకి వచ్చిన ఆంగ్లంలో కూడా Brahma అనే రాస్తం, Bramha అని రాయం. ఇన్ని లిపులు బ్రహ్ అని చెబుతుంటే బ్రమ్హ అని ఎలా పలకను?

సమస్యబ్రహ్మ’లోనే ఉందా అంటే కాదు. చాలా పదాల్లో ఉంది. బ్రహ్మలో ఉంది కనుక బ్రహ్మతో మొదలయ్యే అన్ని పదాల్లో ఉంది. బ్రాహ్మణ, బ్రహ్మాండం, బ్రహ్మానందం, బాల సుబ్రహ్మణ్యం మో||. ఇవేకాక, వీటితో పాటు వేరే పదాలు చాలా ఉన్నాయి. మధ్యాహ్నం - దీన్ని మధ్యాన్హం అని లేదా మధ్యాన్నం అని ఉచ్చరిస్తారు. చిహ్నాన్ని కొందరు చిన్హం అంటారు. ఈలా చాలా మకతికలు ఉన్నాయి. అసలే చిన్నప్పటినుండి తికమక పడుతున్న నాకు ఈమధ్య మరో పదం తగిలింది. శంకర్ మహదేవన్ గారుఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి’ పాటలో, 'గురు విక్రమాయ గుహ్య  ప్రవరాయ  గురవే గుణ గురవే'లో గుహ్యను గుయ్హ అని ఉచ్చరించారు. నేను ఇన్నాళ్ళూ ఆ పదాన్ని గుహ్యం అనే పలికా విన్నా కూడా. మొట్టమొదటిసారి పాటలొ గుయ్హం అని విన్నా.  పోనీ పదాలన్నీఒత్తుకు సంభందించినవే కదా, ‘కు ఏదైనా హల్లు ఒత్తుగా ఉన్నప్పుడు, ఒత్తుకు సంబంధించిన హల్లును ముందుగా పలికి తరువాతహ’ను పలకాలేమో అనుకుందామా అంటే; బాహ్యం, ప్రహ్లాదుడు, ఆహ్లాదం, జిహ్వ ఇలా ఎన్నో పదాలు రాసినట్టుగానే పలుకుతున్నాం కదా. మరి ఆ కొన్ని పదాల్లో ఆ తేడా ఎందుకు? ఏంటీ తికమక? ఎలా పలకను?

నాకీ అనుమానం (పెనుభూతం) చిన్నప్పుడే వచ్చింది కనుక మా బడిలో తెలుగు సంస్కృత పంతుల్లను అందరిని అడిగా. కొందరు రెండు ఉచ్చారణలు సరైనవే అని చెబుతే, కొందరు బ్రహ్ అని పలకాలని, మరికొందరు బ్రమ్ అని పలకాలని చెప్పారు. పదం ఉచ్చారణ మీద వాళ్ళల్లో కూడా బేధాలున్నాయి. నేను మాత్రం బ్రహ్మ (బ్రహ్) అని పలకాలని నిశ్చయించుకున్నా.

ఇంకొన్ని మకతికలతో మరో 'ఎలా పలకను?'లో కలుద్దాం.

గమనిక: ఉచ్చారణను రాసి చూపించడం కోసం, ఈ ఉల్లేఖనంలో అక్షరాల్ని విడగొట్టడమైనది. అలా రాయాలని కానీ అలా పలకాలని కానీ నా ఉద్దేశ్యం కాదు.

My sweet memories: Netscape Navigator

Netscape Navigator, the browser that dictated internet, the browser that contributed towards the growth of web is out of game now. Even though it’s not there, its domination as a web browser can be seen even today. All modern browsers including its archrival Internet Explorer use ‘Mozilla’ in user agent string. I wonder any one of today’s developers ever wondered why Internet Explorer uses ‘Mozilla’ in user agent string. (Please understand that ‘Mozilla’ is neither an invention nor a trademark of Firefox. It existed even before Firefox took birth.) In olden days, Netscape was an advanced browser that supports many advanced features of HTML, JavaScript etc. None of the other browsers supported these features. As always, cross browser compatibility was an issue. So developers used render page based on the user agent. For Netscape they used to render page with advanced features and for others they used to render page with basic features. (By the time I started developing it was more common to use ‘document.layers’ & ‘document.all’ in JavaScript to differentiate browsers.) Programmers rendering page based on user agent really became challenge for other browsers. Even though other browsers (like IE) started supporting advanced features, it was of no use as HTML code was rendered with basic features only. To get advanced HTML rendered from the code, only option left for the browsers was to use ‘Mozilla’ in user agent. From then all browsers started using ‘Mozilla’ in user agent. Concept of DHTML was originally from Netscape where dynamism was created using layers. Such was the domination of Netscape on web.

I started using internet from 1999, however it was that I never had any special interest or disinterest for Netscape at that time. It was in 2001, when I started working as a web developer, my love for Netscape started. We were developing a web application that needs to be supported by Netscape 4.7 & Internet Explorer 4.0, 4.5. I started liking Netscape when we started addressing issues of cross browser compatibility. If you go by the first impression then you will obviously like IE. IE displays the content on your page irrespective how bad you write your HTML code. On the other hand Netscape won’t display the content if your HTML code is not properly nested. So naturally, a developer will like IE. But it is when you face issues on your page, (Eg: content is getting displayed on the left side of browser instead of right side) you understand the value of Netscape. To debug these issues with IE, you need to go through entire HTML code to find missing tags. However Netscape directly shows which section of your code is failing. We used to fix these type of issues with the help of Netscape. I used to call Netscape a disciplined browser; it displays only well-structured HTML code and suppresses content when there is issue with nesting. If your HTML works in Netscape you are almost sure that it will work in all browsers that were available then like IE, Opera etc. However if your HTML works in IE, you never know how it will behave in other browsers. Netscape was very much useful to solve issues with HTML. Few problems that we faced (space between <TABLE&gt, space on the top of the page, irregular behavior of <td>  etc) were easily resolved with the help of Netscape and I am sure we would have spent 100 times of effort to solve them with help of IE. This increased my value for Netscape and I had almost stopped using IE.

Another place where Netscape was extremely useful was in debugging JavaScript. JavaScript can’t be compiled and it will throw compilation errors during runtime when it is interpreted. For these errors, IE shows stupid error message which can’t be understood at all. Netscape has JavaScript console that shows exact location of error in your code. That makes life of a developer very easy. So I always used Netscape while working with JavaScript. It made my life easy and I could write very complicated JavaScript code easily.

My love for Netscape further increased when I came to know that JavaScript was developed by Netscape. (JavaScript is a highly secured client side programming language when compared to its counterpart VBScript). Knowing this information, my love for JavaScript and Netscape increased again. I did some research on JavaScript and Netscape to find more details. This research helped me understand how secure Netscape was when compared to IE. From that point onwards, I started opening my yahoo mail in Netscape only (No IE plz). Also I came to know that there is a something known as Server Side JavaScript. I learnt server side java script out of my interest; it was really interesting to work with it. I never got a chance to use server side JavaScript in a live project. (I am not sure how many people know that there used to be a language known as server side JavaScript. It used to work on Netscape Enterprise Server and iPlanet.)

As a developer I could appreciate security features, compliance to standards, and support to advanced HTML & JavaScript in Netscape 4.7 when compared to IE 4.5. However release of IE 5.0 was a big challenge/blow to Netscape. As a developer and being lover of Netscape, I noticed several shortcomings of Netscape when compared to IE5.0 and was eagerly waiting for the new release of Netscape i.e. Netscape 5.0. But to my disappointment it was announced that Netscape 5.0 release was cancelled. When IE 5.5 got released, even I stopped using Netscape, but I was seriously waiting for the release of next version Netscape.

By the January 2002, I moved to Oracle eBusiness Suite from web development. As a result, I lost the track of changes that are happening in web world. A new banded Netscape, whose run time engine is completely rewritten from scratch, got released as Netscape 6.0. But I was terribly disappointed with it. It was in no way comparable with then dominating browser I.E 6.0. None of latter releases of Netscape 7.0, 8.0 & 9.0 were impressive. Announcement from AOL that it will stop Netscape from 2008 was really disappointing news for me. I was waiting for a version that can compete with IE. This announcement made it clear to me that this dream of mine will never be fulfilled.

Why once dominating browser came to an end? What made a once a ruler to lose the game completely and move out of the game? I personally feel, it is AOL. AOL took over Netscape Communications Corporation and didn’t pay much interest in developing Netscape Navigator. It even laid-off complete staff of original Netscape Navigator. Also rapid growth of IE became a threat to existence of Netscape. As there was no support from AOL & huge competition from IE, Netscape was left with no option than to die. Even though Netscape ended its life in 9.x version, I personally consider 4.x as its end.

Despite of it losing the game, it won the heart of many developers like me. I still have it installed on my desktop. (Can you imagine Netscape 4.7 running on Windows 7?)

Wednesday, December 5, 2012

మద్రాసి

మద్రాసీ, నాకు అస్సలు నచ్చని పిలుపు. ఎవరైనా నన్ను మద్రాసీ అని పిలిస్తే వాన్ని క్షణమే అక్కడే చంపెయ్యాలన్నంత కోపం వస్తుంది. నేను గుజరాత్లో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా నన్ను మద్రాసీ అని పిలిచారు. నాకు చాలా కోపం వచ్చింది, నేను మద్రాసీని కాదు, నా భాష తమిళ్కాదు, నేను తెలుగువాన్ని, నేను హైదరాబాదీని అని నెత్తినోరు కొట్టుకుని మరీ చెప్పినా, నన్ను నా మాటను పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. ఏమైనా అంటే, 'సబ్ ఏకీ హై, సబ్ మదరాసీ హై, సబ్ తమిళ్ బోల్తే హై', అంటూ మూర్ఖంగా మాట్లాడే వాళ్ళ మాటలు వింటే నాకు మండుకొచ్చేది. వీళ్ళు చదువుకోలేదా? వీళ్ళకు భారతదేశం అందులో ఉన్న రాష్ట్రాలు తెలీవా? ఎందుకింత మూర్ఖంగా మాట్లాడతారు? చదువుకోని వాళ్ళేకాదు, డిగ్రీ పుచ్చుకున్నవాళ్ళు, ఇంజనీరింగ్ చేసినవాళ్ళు, డాక్టర్ చదివినవాళ్ళు ఒక్కరేమిటి అందరి అభిప్రాయం అదే దక్షిణాదీయులు అంతా మద్రాసీలే. నాది కాని గుర్తింపును ఒప్పుకోవడానికి నా మనసు ఎప్పుడూ అంగీకరించలేదు. అప్పటుండి ఎవరో ఒకరు మద్రాసీ అనడం, నేను కాదు అని యుద్దం చేయడం నాకు మామూలయిపోయాయి. అలా మొదలైన మద్రాసీ గుజరాత్లో ఉన్న రెండు సంవత్సరాలు నాకు పిచ్చెక్కించింది. పిలుపే, చివరికి కాదు మాట అంటేనే నాకు అసహ్యం వేసేలా చేసింది.

అయితే గుజరాత్లో ఉన్న రెండేళ్ళలో జరిగిన ఒక సంఘటన మాత్రం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఒకసారి మిత్ర్తుడి ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళ తాత యధాప్రకారం నన్ను మద్రాసీనా అని అడిగాడు. నేను కూడా ఎప్పటిలాగే కాదూ నేను హైదరాబాదీని అన్నా. ఆశ్చర్యం, తను నన్ను అంటే నువ్వు నైజామీనా అని అడిగాడు. ‘అవును’ అని అరచినంత పని చేసా. మద్రాసి అని పరాయి గుర్తింపుకాకుండా, నాదైన గుర్తింపుకోసం తహతహలాడుతున్న నాకు నైజామీ అని పిలవగానే శ్రావ్యమైన సంగీతం విన్నంత అనందం కలిగింది. కానీ ఇక్కడ ఎవరికీ తెలియని నైజామీ ముసలాయనకు ఎలా తెలుసు? ప్రశ్నకు సమాధానం బ్రహ్మకు కూడా తెలీదేమో. [ఇంకో విషయం, నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత కాలం, ఎవరైనా నన్ను నైజామీ అంటే ఒప్పుకునేవాన్ని కాదు. నేను మహ్మదీయున్ని కాదు కనుక నేను నైజామీ కాదు, నేను తెలుగువాన్ని అనేవాన్ని. కానీ అంతకాలం నేను అసహ్యించుకున్న నైజామీ అనే గుర్తింపే నాకు ఆనాడు చాలా ఆనందాన్నందించింది.]

నేను గుజరాత్ నుండి వచ్చేసినా మద్రాసీ బూతం నన్ను పూర్తిగా వదిలిపెట్టలేదు. ఎప్పుడు ఉత్తరాది రాష్ట్రానికి వెళ్ళినా అది నన్ను పట్టి పీడిస్తుంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, డిల్లీ, ముంబాయి ఇలా ఎక్కడికెళ్ళినా వాళ్ళు నన్ను మద్రాసీ మద్రాసీ మద్రాసీ అనడం నేను కాదు కాదు కాదు అనడం మామూలయిపోయింది. ఎక్కడొ ఉన్న నగరల్లో ఎందుకు, హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న పూణే నగరంలో కూడా, మద్రాసీ అని పిలిస్తే, ఛీ అనుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయా. మద్రాసీ తలనొప్పి నన్నొక్కన్నే కాదు, ఉత్తర భారతం వెళ్ళిన ప్రతి తెలుగువాన్నీ బాధపెట్టుంటుంది. అందులో అనుమానం అణుమాత్రం కూడా లేదు. ఒక్క తెలుగువాళ్ళనే కాదు కన్నడీగుల్ని, మళయాళీలను కూడా బాధపెట్టుంటుంది. మనకు మద్రాసీలు అని, తమిళ్ మన భాష అని గుర్తింపు ఎందుకు? మనకంటూ గుర్తింపులేదా? లేక తమిళులు అంత గొప్ప గుర్తింపును పొందారా? గుర్తింపుముందు మనం కొట్టుకుపోయామా? నిప్పులేనిలే పొగలేదు కదా, మరి పొగవెనుక గల నిప్పు ఏంటి?

దీనివెనక ఏదైనా చారిత్రాత్మక కారణం ఉందా అని వెతకడం ప్రారంభించిన నాకు, చరిత్ర పుస్తకాలు తిరగేస్తుంటే దీనివెనకున్న కారణం ఇదేమో అనిపించే విషయం ఒకటి కనిపించింది. అయితే కారణం ఇది అని నేను పుస్తకంలో చదివింది కాదు. చరిత్రను పరిశీలించి, నాకు నేనుగా నిశ్చయించుకున్న విషయం. ఇది తప్పవ్వవచ్చు కానీ ఇదే సరైన కారణం అని నా అని నా అనుమానం, ఇంతకన్నా వేరే కారణం ఉండకపోవచ్చు.

ఒక్కసారి చరిత్రలో వెనక్కేళ్ళి 1947 దగ్గర ఆగి భారత దేశాన్ని పరిశీలిస్తే. దక్షిణ బారతంలో చాలా బాగం మద్రాస్ ప్రెసిడెన్సీలో (చెన్నపురి సంస్తానం) ఉండేది. ఆంగ్లేయుల సామ్రాజ్యంలో దక్షిణ భారతం మొత్తం మద్రాస్ ప్రసిడెన్సీనే. (ఆంధ్రప్రదేశ్లో తెలంగాణా జిల్లాలు తప్ప మిగిలిన్న ప్రాంతం అంతా మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమే.) దక్షిణ భారతంలో మద్రాస్ ప్రసిడెన్సీ కాక హైదరాబాదు, మైసూరు ఉన్నా రెండూ ఆంగ్లేయుల సామ్రాజ్యంలో భాగం కాదు. చారిత్రాత్మక నిజాన్ని బట్టి పరిశీలిస్తే ఆనాటి దక్షిణ భారతం మొత్తం మద్రాసే కదా, నాటి దక్షిణ భారతీయులందరు మద్రాసీలే కదా. అలా మొదలయ్యుండాలి దక్షిణ భారతీయుల్ని మద్రాసీలు అని పిలవడం. పిలుపే ఈనాటికి నిలిచిపోయింది. ఆనాడు నన్ను ముసలాయన నైజామీగా గుర్తించడానికి గల కారణం తనకు ఆనాటి రాష్ట్రాలైన మద్రాస్ ప్రేసిడెన్సీ, హైదరాబాద్, మైసూర్ తెలిసుండాలి.

స్వాత్రంత్ర్యానికి పూర్వం ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీ పోయినా, మద్రాసు నగరమే చెన్నైగా మారిపోయినా, మద్రాసీ అన్న పేరు మాత్రం ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉంది. ఉత్తర భారతీయులు మద్రసీని మరాచిపోయి మనకు మన గుర్తింపివ్వడానికి ఇంకా రెండు, మూడు తరాలు పడుతుందేమో. అంతవరకు మద్రాసీ రాక్షసి మనకు తప్పదేమో.

నేను చెప్పిన ఈ కారణం తప్పని మీకు తెలిస్తే, మద్రాసీ అన్న పిలుపువెనక గల సరైన కారణం మీకు తెలిసుంటే ఇక్కడ రాయండి.