Friday, August 30, 2013

మేఘమా... మేఘమా....

ఆషాఢ మాసాన ఆ నీలి గననాన మేఘాల రాగాల ఆలాపన... ఆ ఆలాపనే చినుకు చినుకు చినుకు చినుకు అని అనుకునేవాన్ని నేను. ఆకాశంలో బారులు బరులుగా సాగే మేఘాలు వర్షం కురిపిస్తాయని మాత్రమే నాకు తెలుసు. ఆ మేఘాల తొలకరి చినుకులో తడిసి ఆనందించాలని నేను ఎంతగా ఎదురుచూస్తానో, అంతే ఆత్రుతగా ప్రకృతిలో ప్రతి అణువు ఎదురుచూస్తుందని మాత్రమే తెలుసు. ఆకాశంలో మెరిసే మెరుపులు, కురిసే వాన, ఆ వర్షానికి గాలితోడై చల్లగా ఆహ్లాదకరంగా వీసే తుషారం .. ఆహా... అవి మాత్రమే తెలుసు. తొలకరి చినుకుకు పులకించిన పుడమిలోంచి వచ్చే పరిమళం.. అమోఘం.. అది మాత్రమే తెలుసు. భాస్కర శతకంలో చెప్పినట్టు 'మేఘుడంబుధికి పోయి జలంబుల తెచ్చి యీయడే వాన' అని మాత్రమే తెలుసు. అవును, నాకు చిన్నప్పుడు మేఘం గురించి తెలిసింది అంతే. మేఘం సమస్త ప్రాణుల దాహార్తిని తీర్చేందుకుగాను వర్షాన్ని కురిపిస్తుందని మాత్రమే తెలుసు.

కానీ కొన్నాళ్ళకు మేఘం వర్షంతో పాటు సందేశాలు కూడా మోసుకెళుతుందని, వాటిని మేఘసందేశాలంటారని తెలిసింది. 'ఆకాశదేశానా ఆషాఢమాసానా మెరిసేటి ఓ మేఘమా..' అని పిలిచి మరీ ఓ ప్రేమికుడు తన విరహ వేదనను తన చెలికి మేఘసందేశంగా విన్నవించమని కోరుకున్నాడు. ఇంతకీ ఆ సందేశం తన ప్రియురాలికి చేరిందో లేదో నాకైతే తెలీదు కానీ, మేఘాలు సందేశాలు కూడా మోసుకెళ్తాయని మాత్రం నాకు తెలిసిపోయింది. మేఘాలు సందేశాలు మోసుకెళ్ళగలిగినప్పుడు ఈ mobile phoneలు ఎందుకు? వాటికి వచ్చే billలు ఎందుకు?

సందేశాలే కదా పోనీ అని ఊరుకుంటే, ఈ మధ్య మేఘాలు కొత్త విద్య నేర్చుకున్నయండొయ్, అదే మేఘ గణన (cloud computing). ఎంకి పెళ్ళి సుబ్బి చాకుకొచ్చిందో లేదో తెలీదు కానీ, మేఘాలు నేర్చుకున్న ఈ కొత్త విద్య మాత్రం నాకు ప్రస్తుతానికి తలనొప్పిగా మారింది. ఏ వెధవతో చర్చించినా ఈ cloud గోలే. Public cloud, private cloud వాటి సాదక బాధకాలు, Oracle Fusion componentsని cloudలో install చేస్తే వచ్చే సమస్యలు వాటి పరిష్కారాలు, ఒక నిపుణుడిగా నేను ఇచ్చే సూచనలు, సలహాలు ఏ చర్చలో అయినా ఇవ్వే. నాకు మాత్రం ఏమి తెలుసు? నేను ఇంతకు ముందు ఎప్పుడైనా మేఘంతో పని చేసానా? ఈ మేఘం నేర్చుకున్న కొత్త విద్య మేఘ గణనపై నాకెప్పుడు పూర్తిగా పట్టు దొరుకుతుందో తెలీదు కానీ, అప్పటివరకు ఈ తలనొప్పి తప్పేలా లేదు. మేఘ గణనపై నాకు పట్టు దొరికేలోపు ఈ మేఘం మళ్ళీ కొత్తగా ఇంకేవిద్య నేర్చుకుంటుందో. అన్నట్టు, ఇంకో విషయం ఈ మధ్య ఎక్కడ cloud అన్న పదం విన్నా నాకు cloud computingఏ స్పురిస్తుంది కానీ, ఆకాశంనుండీ వర్షం కురిపించే మేఘం స్పురించడంలేదు.


ఈ మేఘం ఇంకా ఎన్ని విద్యలు నేర్చుకుంటుందో.. మేఘ సందేశం, మేఘ గణనం (cloud computing)భవిష్యత్తులో cloud cleaning, cloud washing, cloud driving, cloud farming…. ఏమోఇవ్వన్నీ నేర్చుకుని వర్షం కురిపించడం మానేస్తుందేమో… work load గురూ.. కొత్త technologies కాదని old technology వర్షం కురిపించడం మీద పనిచేస్తుందో లేదో...

Monday, August 19, 2013

భోలి సీ సూరత్, ఆంఖోం మే మస్తీ

టైం చూస్తే ఏడయ్యింది, ఎనిమిదింటికి doctor appointment ఉంది. వీళ్ళేమో ఈ call ఇప్పట్లో ముగించేలా లేరు. ఇప్పుడేలా అని ఆలోచిస్తూ మనస్సెక్కడో పేట్టి call వింటున్నా. ఒక ఇరవయి నిమిషాలయ్యాకగానీ అయిపోయిపోలేదా call. హమ్మయ్య అనుకుని laptopని సంచిలో కుక్కి receptionన్ వైపు పరిగెత్తా. Reception వెళ్ళి చూసుకుంటే mobile లేదు. చీ, ఎంత తొందరగా పూర్తి చెయ్యాలనుకుంటున్నానో అంత ఆలస్యం అయిపోతుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళి mobile తీసుకుని lift వైపు పరిగెత్తా. ఎక్కడో పదవ floorలో ఉంది ఆ lift. అది ఎప్పుడూ టైంకి రాదు. ప్రతి floorలో ఆగుతూ మెల్లిగా వస్తుంది. తొందరలోఉన్నా కదా అందుకే దాన్ని కూడా తిట్టుకున్నా. వయ్యారంగా వచ్చి ఆగిందా lift, కానీ నాకంటే ముందు వచ్చినవాళ్ళు ఎక్కగానే full అయిపోయింది. ఇక నేను ఇంకో lift వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే. తప్పదు.
నిదానమే ప్రధానం అన్నట్టుగా మెల్లిగా వచ్చి ఆగింది ఆ lift. Lift తలుపులు తెరిచీ, తెరుచుకోగానే ఎదురుగా కనిపించింది తను. పై floorలో ఉన్న ఎదో ఒక companyలో పని చేస్తుందనుకుంటా, తనని చూడటం అదే మొదటిసారి కానీ ఇన్నాళ్ళూ తనకోసమే ఎదురుచూస్తున్నానా అనిపించింది. తనను చూసిన ఆ క్షణం మనసు గతి తప్పింది. office నుండి ఇంటికి వెళ్ళే సమయంలో కూడా, అలసటన్నదే లేకుండా అప్పుడే వచ్చిందా అన్నట్టుంది తన మోము. అందమైన ఆ చిరునవ్వును చూస్తే ముక్కోపికూడా శాంతంగా మారాల్సిందే. ఆ కంటి చూపుకే సమ్మోహితున్నయిపోయి నేను ఎక్కడున్నానో కూడా మరచిపోయాను. అన్నీ మరచిపోయి, నా ప్రమేయం లేకుండానే తనని చూస్తూ ఉండిపోయాను. నేనలా తదేకంగా తననే చూస్తూ ఉంటే ఏంటి అన్నట్టుగా కనుబొమ్మలు ఎగిరేసి అడిగింది. తన ప్రశ్నకు ఈలోకంలోకి వచ్చిన నాకు అయోమయం, సిగ్గు, మొహమాటం అన్నీ ఒకేసారి కలిగాయి. తొలిచూపులో ప్రేమలోపడటం, love at first sight అంటే ఇదేనేమో. ఇన్నాళ్ళూ ఏనాడూ నేను అంగీకరించని ఈ తొలిచూపులో ప్రేమ నాకే ఎదురయ్యింది. తన ఆలోచనల్లో మునిగిన నాకు, lift తలుపులు మూసుకుంటున్నాయి అని మళ్ళీ కనుసైగ చేసి, ‘చూసింది చాలు ఇకలోపలికిరా అన్నట్టుగా చూసింది తను. అప్పుడు నాకైతే తల ఎక్కడపెట్టుకోవాలన్నంత సిగ్గేసింది. ఏమయింది నాకు అనుకుంటూ liftలో తనపక్కనే నిలుచున్నా. ఎదురుగా నిలబడితే బాగుండేదేమో, తనని చూసే అవకాశం కలిగేది అనుకున్నా. కానీ పక్కనే నిలబడితే ఉన్న అదృష్టం అప్పుడే తెలిసింది. fan గాలి తనపైనుండి వీస్తూ తన పరిమళాన్ని నా వైపుకు తీసుకొస్తోంది. ఆ పరిమళానికి అనిర్వచనీయ అనుభూతికి లోనవుతూ, తేరుకునేలోపే ground floor వచ్చేసింది. Ground floorలో తను దిగిపోయింది. మరో లోకంలో ఉన్న నేను తను వెళ్ళిపోతుంది అన్న విషయం గ్రహించేలోపే lift తలుపులు మూసుకున్నాయి.
ఛా, నేను కూడా ground floorలో దిగిపోయ్యుండాల్సింది. Bike కోసం parkingలోకి రావల్సొచ్చింది. అయినా ఒక్కరోజు bikeని officeలో వదిలేస్తే ఏమయ్యేది. అసలు నాకు bike ఎందుకు ఉందా అనిపించింది. ఇదంతా bike మూలంగానే, మళ్ళీ తను కనిపిస్తుందో లేదో. మనసు ఎంతో గందరగోళంగా ఉంది. మెల్లెగా నడుచుకుంటూ bikeని చేరి, నిరాశగా start చేసి ఇంటిదారి పట్టా. Bike నడిపిస్తున్నానే గానీ మనసు మాత్రం driving మీద లేదు. Parkingనుండి బయటకు రాగానే చిన్నగా వానచినుకులు ఒంటిమీద పడేసరికి ఈ లోకానికొచ్చా. Main gate వరకు వచ్చేసరికి వర్షం పెరిగింది. ఇక లాభం లేదు, వర్షం నన్ను తడిపేస్తుంది. కాసేపాగి వర్షం తగ్గాక వెళ్ళొచ్చు అనుకుని bikeని చెట్టు వైపు నడిపించా. అప్పుడే ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుగులో ఆ చెట్టుకింద కనిపించింది తను. ఆ క్షణం నా మనసులో కూడా మెరిసింది ఒక మెరుపు. వర్షానికి తడవకుండా, వీచే గాలి కలిగిస్తున్న చలికి ముడుచుకున్న పుష్పంలా ఉంది తను. ఈ అవకాశాన్ని వదులుకోను. ఈసారి తన పేరు, పూర్తి వివరాలు తప్పకుండా కనుక్కుంటా అనుకుంటూ bikeని చెట్టు వైపు నడిపించి, చెట్టు దగ్గర stand వేసి, వర్షపు నీటిలో నడుచుకుంటూ తనవైపు వెళ్ళి, తనను చూసి ఏమి అడగాలో తెలీక ఒక చిరునవ్వు నవ్వి, పేరు అడుగుదామనుకునేంతలో current పోయింది.
మన electricity department వాళ్ళకు ఇదో చెడ్డ అలవాటు. వర్షం పడగానే current తీసేస్తారు. Current పోతే fan తిరగదు. అదిలేకుంటే మనకు నిద్ర పట్టదు. ఇంకే మెలకువొచ్చేసింది.

ఆంఖ్ ఖులీతో దిల్ చాహా ఫిర్ నీంద్ ముఝే ఆ జాయే
బిన్ దేఖే యే హాల్ హు ఆ దేఖూ తో క్యా హో జాయే


భోలి సీ సూరత్, ఆంఖోం మే మస్తీ దూర్ ఖడీ షర్మాయే .. ఆయ్ హాయ్