Monday, November 11, 2013

Windows శకం ముగియనుందా?

Computer అంటే Windows ?  ప్రపంచంలో చాలా మందికి computerతో పని చెయ్యడం అంటే Windowsమీద Internet Browser లేదా Microsoft officeలతో పనిచేయడం మాత్రమే. ఈనాటి ప్రపంచంలో చాలా మందికి computer అంటే కేవలం Windows మాత్రమే. కంప్యూటర్ అంటే Windows కాదు, Windows కేవలం ఒక operating system మాత్రమే, ఇలాంటి operating systemలు ఎన్నో ఉన్నాయి అని తెలిసింది ఎందరు? కేవలం Techies మాత్రమే. Windows-95 operating system ద్వారా Graphical User Interfaceతో ఒక విప్లవాత్మక మార్పుని తీసుకొచ్చి, సామాన్యుడికి కూడా computerని అందించిన ఘనత Windowsది. Windows కనుక లేకుంటే ఈనాటికి సామాన్యుడికి computer అనేది ఒక మేధావుల యంత్రంగానే ఉండేదేమో మిగిలిపోయేదేమో. కానీ దాన్ని సామాన్యుల యంత్రంగా మార్చింది Windows, Windows-95 ద్వారా. అప్పటి నుండీ ఇప్పటివరకు, అంటే దాదాపు ఇరవై సంవత్సరాల పాటు విండోస్‌దే ఏకచక్రాదిపత్యం. అయితే ఇంత ఘన చరితగల Windows తెరమరుగవనుందా?

ఇంట్లో ఏదో చిన్న చిన్న పనులకు computer వాడే వాళ్ళకు ఇంత పెద్ద Windows operating System ఎందుకు అని నేను చాలాసార్లు అనుకునే వాన్ని. కానీ వేరే మార్గం లేదు, ఉన్నది windows ఒక్కటే, దాన్నేవాడుకోవాలి. నా దగ్గర Truck మాత్రమే ఉంటే పక్క వీధికి వెళ్ళడానికి కూడా దాన్నే వాడాలి అన్న చందంగా అన్ని పనులకూ Windowsనే వాడాలి. దానికోసం బోలెడు RAM కావాలి, బోలెడు memory కావాలి, మంచి processor కావాలి. అయినా ఇంతకాలం ఇవ్వన్నీ ఇంతకాలం Windows ఎదుగుదలకు ఎప్పుడు ఆటంకం కాలేదు. కానీ మారుతున్న పరిస్తితులకు అనుగుణంగా మారలేని Windows ఎంతకాలం ఇలా మనగలుగుతుంది.

నిన్నటివరకు computer అంటే ఒక PC లేదా ఒక Laptop. కానీ నేడు PC, Laptop అనేవి ఒక గతం, అవి గతకాలానికి గుర్తుగా మిగిలిపోయినా ఆశ్చర్యపోనవసరంలేదు. నేటి ప్రపంచం smartphone & tablet లది. ఒక Techie చేయాల్సిన పనులకు Tablet సరిపోకపోయినా, సాధారణ ప్రజల రోజూవారి వాడకానికి Tablet సరిపోతుంది. Tabletతో Laptop ఎంతకాలం పోటీగా నిలవగలదు అంటే, ఎక్కువకాలం నిలవలేదేమో అనిపిస్తుంది నాకు. సాధారణ ప్రజల వాడకంలో laptop కన్నా Tablet పెరిగిపోతుందన్నది మన కంటికి కనిపిస్తున్న నిజం. అలా అని రేపే Laptop వాడకం ఆగిపోతుందని నేను అనడం లేదు కానీ సమీప భవిష్యత్తులో ఇది జరగడం మాత్రం తధ్యం. Laptop వాడకం తగ్గిపోతే దానితో పాటు Windows వాడకం తగ్గిపోయినట్టే. రేపటితరం సాధనాలయిన Tablet, Smartphobeలలో ఎక్కవ RAM, memory, processing speed ఉండవు, వాటిలో సాధారణ Windows నడవదు, కనుక వాటికి ప్రత్యేక OS కావాలి. Tablet, Smartphobeల operating systemsలో Windows అతి దారుణంగా వెనకబడిపోయింది. Windows Phone, Windows RT వినియోగదారుల్ని సంతృప్తి పరచడంలో అతి దారుణంగా విఫలమయ్యాయి. అంతేకాదు Windows-8 కూడా ఒక చెత్తా operating systemగా పేరు తెచ్చుకుంది. Windows పరిస్తితి ఎంత దారుణంగా ఉందంటే ఒక mobile/tablet కొనడానికి వెళితే కొట్టువాడే Windows Phone వద్దు అని చెబుతున్నాడు. మరోవైపు ప్రత్యర్ధుల operating systems అయిన Android, iOSలు పోటీలో దూసుకెళ్ళిపోతున్నాయి. ఇప్పటివరకు Mobile/Tablet operating systems పోటీలో లేని Windows, ఈ పోటీలో ఎప్పుడు చేరుతుంది? అప్పటివరకు ప్రత్యర్ధులు ఎంతముందుకు దూసుకెళ్ళిపోతారు? ఆలస్యంగా పోటీలో చేరి అప్పటికే దూసుకెళుతున్న ప్రత్యర్ధులకు పోటీ ఇవ్వగలదా? మనం ఇక్కడ ఇంకో విషయం గమనించాలి, mobile device operating systems జనాంగీకారం పొందడానికి అతిముఖ్యమైనవి mobile apps. Mobile appsలో ఇప్పటికే Windows వెనకబడిపోయింది. కొత్త operating system తయారు చేసేనాటికి ఉండే mobile appsకు windows supportరావడానికి ఎంత సమయం పడుతుంది అన్నది Windows జయాపజయాల్ని నిర్ణయిస్తుంది.

అలా అని నేనుWindows  పూర్తిగా కనుమరుగయిపోతుంది అనడంలేదు. Windows పరిభాషలోనే చెబితే దాని వినియోగదారులు మూడు రకాలు. వారి అవసరానికి అనుగుణంగా Windowsలో మూడు రకాలున్నాయి. Windows Home, Windows Professional, Windows Server. మొదటి వర్గంలో ఉన్న సామాన్య వినియోగదారులు Windows Homeని వాడతారు, వీరు ఎక్కువగా వాడేది Browser & Microsoft Office. వీరంతా రానున్న కాలంలో Tabletకి మారిపోవడం తధ్యం. అంటే Windows Home వినియోగం ఆగిపోయినట్టే. ఇక రెండో వర్గం వారు Techies, developers, architects, managers. వీళ్ళు Lappyనుండి Tabletకి మారలేరు, వీళ్ళకు కావలసిన పనులు Tabletలో జరగవు, కనుక వీళ్ళకు Windows operating system తప్పదు. ఈ వర్గంలో Windows కొంతకాలం ఉంటుంది. అయితే ఎంతకాలం ఉంటుందో చెప్పలేం, Tabletsలలోకూడా RAM, memory, processing రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈనాడు Laptopలో చెయ్యగల ప్రతిపని భవిష్యత్తులో Tabletలో చేయగలిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. మూడవ వర్గం servers. ఈ వర్గంలో Windows ఇప్పటికే వెనకబడిపోయింది. Server కోసం Linux లాంటి operating systems వైపు మొగ్గుచూపిస్తారు, Windowsని పెద్దగా ఇష్టపడరు. మరి భవిష్యత్తంతా cloud based serversదే అయినప్పుడు cloudలో Windowsను ఎవరు ఎందుకు వాడతారు? అంటే ఈ వర్గంలో కూడా Windows దాదాపుగా ముగిసిపోయినట్టే.

రేపటి mobile devices విపణిలో నిలవాలంటే ముందుగా Windows OS Architectureను సమూలంగా మార్చి, వాటి అవసరాలకు అనుగుణంగా Re-architect చేయాలి. ఇంతాచేసినా Windows పోటీలో నిలవగలదా అంటే ఇదమిద్దంగా సమాధానం చెప్పలేము. ఇన్నాళ్ళూ PC/Laptop విపణిలో Windowsది ఏకచక్రాధిపత్యం. Apple OS X, Google Chrome లాంటి operating systems ఉన్నా అవి చెప్పుకోదగ్గ పోటీ ఇవ్వలేకపోయాయి. పోటీయే లేని విపణిలో రారాజుగా వెలిగింది Windows. కానీ ప్రస్తుత పరిస్తితులు వేరు, ప్రత్యర్ధులైన Android, iOSలు ముందంజలో ఉన్నాయి. దానికితోడు Windows Phone, Windows RTలు వినియోగదారుల్లో Windowsకి చెడ్డపేరు తెచ్చిపెట్టాయి. ఇలాంటి పరిస్తితుల్లో Windows నిజంగా పోటీలో నిలవగలదా? వినియోగదారుల్ని Windowsవైపు ఆకర్షించే ప్రత్యేకతలు చూపగలదా?

Windows భవిష్యత్తు అంతా నిరాశాజనకమేనా? ఆశాజనకమైన విషయాలే లేవా అంటే ఉన్నాయి. Nokia, Mocrosoftల మధ్య పొత్తు, Ultrabook లాంటివి. Nokia, Mocrosoftల మధ్య పొత్తు నిజంగా Windowsకు విజయాన్ని అందిస్తుందా లేక జోగి జోగి రారుకుంటే రాలేది బూడిదే అన్న చందంగా మిగిలిపోతుందా అన్న ప్రశ్నకు సమాధానంకోసం మనం వేచి చూడాల్సిందే. Windowsకు మిగిలి ఉన్న ఒకే ఒక ఆశాకిరణం Ultrabook. Laptop, Tabletల సంకరంగా రాబోతుంది ఈ Ultrabook. ఇప్పటికే వచ్చిన Ultrabookలు చాలా ఆకర్షనీయంగా కనిపిస్తున్నాయి. Tablet ఆకృతితో Laptop processing సామర్థ్యంతో వచ్చే ఈ Ultrabook నిజంగా ఓ ఆశాకిరణమే. ఈ Ultrabookకి Intel (ARM ప్రత్యర్ధి కనుక) మద్దతు కూడా ఉంది. Tablet కన్నా Ultrabook కొనడానికి వినియోగదారులు మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయన్న విషయం Windowsకు ప్రాణవాయువే. ఇక్కడ కూడా Apple OS X, Google Chrome, Androidలు పోటీకి వచ్చే అవకాశంలేకపోలేదు. ఏది ఏమయినా భవిష్యత్తు Windowsకు నల్లేరు మీద నడకమాత్రం కాదు.


అయితే నాకేంటి? మీకు ఉందోలేదో కానీ నాకు మాత్రం చాలా ఉంది. Windows-NT (& corresponding Office) నుండి దాచుకున్న data ఎంతో ఉంది. దాన్ని భవిష్యత్తు operating systems (&corresponding office)లో చూడగలనా లేదా అన్నది చాలా పెద్ద చిక్కు ప్రశ్న. అందుకే Windows-7, Office 2007ల installer లను దాచుకుంటున్నా భవిష్యత్తులో అవసరమొస్తాయేమో అని. అలాగే భవిష్యత్తులో collegeనుండి బయటికొచ్చే విద్యార్థులు .Net technologyలకు దూరంగా ఉండటం మంచిదేమో అని నా అభిప్రాయం.

Saturday, November 2, 2013

దీపావళి శుభాకాంక్షలు

దీపావళి దీపంలా మీ చిరునవ్వు వెలగాలని
టపాకాయలా మీ బాధలన్నీ తునాతునకలవ్వాలని
తారాజువ్వలా మీ ఆనందం పైపైకి ఎదగాలని మనసా వాచా కర్మణా కోరుకుంటూ

బ్లాగు మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు

పోస్ట్ చేయని ఉత్తరాలు -3

ప్రియమైన కవిజ్ఞకు,

జీవితం ఎవర్ని ఎందుకు కలుపుతుందో, ఎందుకు దూరంచేస్తుందో తెలీదు. నా జీవితం కలిపిన, దూరంచేసిన మధురమైన జ్ఞాపకానివి నువ్వు. మదిలో మెదిలీ మెదలగానే మరోలోకానికి తీసుకెళ్ళే అందమైన జ్ఞాపకం నీది. చిత్రంలో విచిత్రం ఏమిటోగానీ ఆ జ్ఞాపకానికి మాటలు తొడగడనికా అన్నట్టు మళ్ళీ వినిపించావు నువ్వు. అందంగా వినిపిస్తావు, ఆనందంగా వినిపిస్తావు కానీ కనిపించవు. కనిపించకుండా వినిపించే జ్ఞాపకానివైన నిన్ను కవిజ్ఞ  అనాలనిపిస్తుంది నా మనసుకి.

మీటగలిగేవాళ్ళుండాలే కానీ రాయయినా సరిగమలు పలుకుతుంది. మరి నీ మాటలు నా మనసు మీటితే  ప్రేమ రాగం పలకకుండా ఉండగలదా. నీ ప్రేమ అందదు అని తెలిసినా, అందుకోవాలని ఆశపడటం దానికి అలవాటే. ఓ క్షణం అందుకోవాలని ఆశపడి, మరుక్షణం అందదు అని తెలిసి నిరాశపడి; ఆశ నిరాశల మధ్య సతమతమైన నా మనసు, ఆ నైరాశ్యంతో కూడిన అసహనన్ని చిరుకోపంగా నీపై చూపిస్తే దాన్ని తప్పుపట్టబోకు సుమీ. ఆ కోపం ప్రేమతో కూడుకున్నదేకానీ నిజమైన కోపం కాదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. తెలుసుననే విషయం ఏనాడూ నీ మాటల్లో చెప్పకపోయినా, నాకోపాన్ని మనస్పూర్తిగా అంగీకరిస్తూ నీ చేతలతో చెప్పావు.

నీ మాటలు వింటుంటే ఈ ప్రపంచం అన్నది ఒకటి ఉంది అన్న విషయం కూడా గుర్తురాదు నా మనసుకు.  మరునిమిషం నువ్వు వెళ్ళిపోతావన్న విషయాన్ని ఆలోచించకుండా ఆ నిమిషం నీ మాటల్లోని చల్లదనంలో సేదతీరుతుంది నా మనసు. అన్నీ మరచిన ఆ క్షణం నువ్వు తనసొంతమనుకొని ప్రేమగా మాట్లాడితే, నువ్వు అందని చందమామవని తెలిసి నీపై అలుగుతుంది నా మనసు. "చందమామ మనకండదని.....ముందు గానే అది తెలుసు కొని... చేయి చాచి పిలవద్దు అని... చంటిపాపలకు చెపుతామా?". అందని జాబిల్లివైన నిన్నుకోరే నా మనసు కూడా చంటిపాపలాంటిదే, మరి నా మనసుకి ఈ చందమామ అందదు అని ఎలా చెప్పను. పోనీ అందని చందమామను అద్దంలో అయినా చూపిద్దామా అంటే, నిన్ను చూపించగల అద్దం నా మనసే కదా. మరి మనసుకు మనసులో నిన్ను ఎలా చూపను. నా మనసుకు నేను ఇవ్వగలిగింది వెన్నెలలాంటి నీ మాటలే కదా..

నా మనసులోనయ్యే ప్రతి భావావేశాన్ని మనస్పూర్తిగా అంగీకరిస్తూ, ఆ ఆవేశంతో చేసే ప్రతిపనిని ప్రేమగా మన్నిస్తూ; నన్ను నన్నుగా నాలోని ప్రతి గుణాన్ని అర్థం చేసుకునే నువ్వు, ఈ జన్మకు నాకు దొరికిన ఒక వరం. ఆ వరం నా సొంతం కానందుకు బాధ ఉన్నా, ఈ జీవితానికి ఈ మాత్రం భాగ్యమైనా దక్కినందుకు ఆనందంగా ఉంది. నన్ను ఇంతగా అర్థం చేసుకునే నీకు నేను ఏమివ్వగలను? ఎప్పటిలాగే కోపం, అలక, పంతం, మొండితనం తప్ప.

నీ.....