ప్రియమైన కవిజ్ఞకు,
జీవితం ఎవర్ని ఎందుకు కలుపుతుందో, ఎందుకు దూరంచేస్తుందో తెలీదు. నా జీవితం కలిపిన, దూరంచేసిన మధురమైన జ్ఞాపకానివి నువ్వు. మదిలో మెదిలీ మెదలగానే మరోలోకానికి తీసుకెళ్ళే అందమైన జ్ఞాపకం నీది. చిత్రంలో విచిత్రం ఏమిటోగానీ ఆ జ్ఞాపకానికి మాటలు తొడగడనికా అన్నట్టు మళ్ళీ వినిపించావు నువ్వు. అందంగా వినిపిస్తావు, ఆనందంగా వినిపిస్తావు కానీ కనిపించవు. కనిపించకుండా వినిపించే జ్ఞాపకానివైన నిన్ను కవిజ్ఞ అనాలనిపిస్తుంది నా మనసుకి.
మీటగలిగేవాళ్ళుండాలే కానీ రాయయినా సరిగమలు పలుకుతుంది. మరి నీ మాటలు నా మనసు మీటితే ప్రేమ రాగం పలకకుండా ఉండగలదా. నీ ప్రేమ అందదు అని తెలిసినా, అందుకోవాలని ఆశపడటం దానికి అలవాటే. ఓ క్షణం అందుకోవాలని ఆశపడి, మరుక్షణం అందదు అని తెలిసి నిరాశపడి; ఆశ నిరాశల మధ్య సతమతమైన నా మనసు, ఆ నైరాశ్యంతో కూడిన అసహనన్ని చిరుకోపంగా నీపై చూపిస్తే దాన్ని తప్పుపట్టబోకు సుమీ. ఆ కోపం ప్రేమతో కూడుకున్నదేకానీ నిజమైన కోపం కాదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. తెలుసుననే విషయం ఏనాడూ నీ మాటల్లో చెప్పకపోయినా, నాకోపాన్ని మనస్పూర్తిగా అంగీకరిస్తూ నీ చేతలతో చెప్పావు.
నీ మాటలు వింటుంటే ఈ ప్రపంచం అన్నది ఒకటి ఉంది అన్న విషయం కూడా గుర్తురాదు నా మనసుకు. మరునిమిషం నువ్వు వెళ్ళిపోతావన్న విషయాన్ని ఆలోచించకుండా ఆ నిమిషం నీ మాటల్లోని చల్లదనంలో సేదతీరుతుంది నా మనసు. అన్నీ మరచిన ఆ క్షణం నువ్వు తనసొంతమనుకొని ప్రేమగా మాట్లాడితే, నువ్వు అందని చందమామవని తెలిసి నీపై అలుగుతుంది నా మనసు. "చందమామ మనకండదని.....ముందు గానే అది తెలుసు కొని... చేయి చాచి పిలవద్దు అని... చంటిపాపలకు చెపుతామా?". అందని జాబిల్లివైన నిన్నుకోరే నా మనసు కూడా చంటిపాపలాంటిదే, మరి నా మనసుకి ఈ చందమామ అందదు అని ఎలా చెప్పను. పోనీ అందని చందమామను అద్దంలో అయినా చూపిద్దామా అంటే, నిన్ను చూపించగల అద్దం నా మనసే కదా. మరి మనసుకు మనసులో నిన్ను ఎలా చూపను. నా మనసుకు నేను ఇవ్వగలిగింది వెన్నెలలాంటి నీ మాటలే కదా..
నా మనసులోనయ్యే ప్రతి భావావేశాన్ని మనస్పూర్తిగా అంగీకరిస్తూ, ఆ ఆవేశంతో చేసే ప్రతిపనిని ప్రేమగా మన్నిస్తూ; నన్ను నన్నుగా నాలోని ప్రతి గుణాన్ని అర్థం చేసుకునే నువ్వు, ఈ జన్మకు నాకు దొరికిన ఒక వరం. ఆ వరం నా సొంతం కానందుకు బాధ ఉన్నా, ఈ జీవితానికి ఈ మాత్రం భాగ్యమైనా దక్కినందుకు ఆనందంగా ఉంది. నన్ను ఇంతగా అర్థం చేసుకునే నీకు నేను ఏమివ్వగలను? ఎప్పటిలాగే కోపం, అలక, పంతం, మొండితనం తప్ప.
నీ.....

heart touching..
ReplyDeletekavigna. kottaga undi prayogam
ReplyDeleteexellent..........brother.......heart touching........
ReplyDeleteaa ammayi evaro kani meeku dakkalani manaspoortinga korukotunna
ReplyDeleteThanks andi. kaanee idi kevalam kalpana... :)
Deletekalpana ainaa manasuni kadilinchela raasaru..awesome....
ReplyDeletemanchi bhaavam..manchi feel. chala bagundandi.
ReplyDeleteMottaniki mee monditanam gurinchi telsukunnaru ;)
ReplyDeletebagundandi. chakkani feel :)
ReplyDeleteనన్ను ఇంతగా అర్థం చేసుకునే నీకు నేను ఏమివ్వగలను?
ReplyDelete-- inta andamaina lekhani iccharu kadaa :)
expressing thoughts in the form of unposted letters-- gud idea and well executed :)
ReplyDeleteThx for informing me.
ReplyDeleteHe copied my blog shamelessly, he didn't even inform me that he is copying.
just browsing randomly and came across your blog. This post is the best!! Hope you both will remain so good friends like this forever!
ReplyDelete