తరచు అడిగే ప్రశ్నలు (Frequently Asked
Questions - FAQs)
ప్రశ్న: మీకు బ్లాగింగ్ చేయాలని
ఎందుకనిపించింది? మీరు బ్లాగింగు ఎనుకు
మొదలెట్టారు?
జవాబు: మీరు నా
బ్లొగ్ బుజ్జి చదివే ఉంటారు. నాకు బ్లాగింగ్ చేయగలననే నమ్మకం కానీ చేయాలనే కోరిక కానీ
ఏనాడు లేదు. బుజ్జి, వెన్నెల్లో ఆడపిల్ల
లాంటివాళ్ళు కొందరు నన్ను రాయడానికి ప్రయత్నించమన్నారు. పెద్దగా పట్టించుకోలేదు కానీ, technical
blogging చేద్దామనుకున్నా.
తెలుగు
భాషాభిమానినైన నాకు, నా తెలుగు వాడకం బాగాతగ్గిపోతుంది అనిపించినప్పుడు నా భాషా
పరిజ్ఞానాన్ని, భాష మీదున్న పట్టుని కాపాడుకోవడానికి ఏదైనా చెయ్యాలనిపించింది. అప్పుడు
మొదటిసారిగా బ్లాగింగ్ గురించి ఆలోచించా. అయితే ఏమి రాయాలి? Technical, spiritual, నా సోది మొ|| అన్నీ రాయాలనుకున్నా. ఇన్ని
రాయలన్నుకున్నప్పుడు ఆ బ్లాగ్ కూర్పు ఎలా ఉండాలి అన్నదానిపై ఒక అవగాహన రాలేక నా
బ్లాగ్ రాయలన్న ఆలోచనను వాయిదా వేస్తూ పోయా. అప్పన్నుండి బ్లాగు
రాయలనిపించిన ఎన్నో ఆలోచనలను వాయిదా వేస్తూనే పోయా. [ఇప్పుడు అవ్వన్నీ మరచిపోయా].
మొదటిసారిగా నేను ఆరు నూరైనా నూరు ఆరైనా బ్లాగు రాయలనుకున్నది నేను గోముఖ్ వెళ్ళి
వచ్చినప్పుడు ఆ యాత్ర గురించి. కానీ ఆరు నూరు కాలేదు, నూరు ఆరు కాలేదు నేను
బ్లాగూ రాయలేదు. ఆ బ్లాగ్ రాయలేదన్న వెలితి నాకు ఈనాటికీ మిగిలిపోయింది.
దుబాయి
వెళ్ళోచ్చాక ఈసారి రెండో ఆలోచన చేయదలచుకోలేదు. కూర్పు గురించిన ఆలోచన పక్కన పెట్టి ముందు రాయలని
నిశ్చయించుకున్నా. ఏదో ఒకటి రాసేస్తే తరువాత కూర్పు గురించి ఆలోచించొచ్చు అని
రాయడం మొదలెట్టేసా.
ప్రశ్న: తాత్కాలిక (temp) బ్లాగు
ఎందుకు?
జవాబు: పైన చెప్పినట్టు, కూర్పు గురించి ఆలోచించడం పక్కన పెట్టి రాయడం
ప్రారంభించాను. అందుకే దాన్ని తాత్కాలిక అన్నాను. ఇవ్వన్నీ ఏదో ఒకనాడు కొత్త
బ్లాగులోకి మార్చాలని నా ఆలోచన. అయితే ఆ రోజు వస్తుందో లేదో తెలీదు. ఈ బ్లాగు
ఎల్లకాలం తాత్కాలికంగా ఉండిపోవచ్చు కూడా.
ప్రశ్న: ఈ తెలుగు
ఎక్కడ నేర్చుకున్నారు?
జవాబు: నేను ప్రత్యేకంగా
తెలుగు ఎక్కడా నేర్చుకోలేదు. నాకు తెలిసింది చిన్నప్పుడు బడిలో చదువుకున్న తెలుగు
మాత్రమే. కాకపోతే నేను తెలుగు మాధ్యమంలో చదువుకున్నా. చాలామంది ఆంగ్ల మాధ్యమంలో
చదువుకున్నారు. అందుకనే నా తెలుగు వారి తెలుగుకన్నా కాస్త మెరుగ్గా ఉంటుంది. నేను ఎప్పుడు పెద్దపెద్ద
మాటలు వాడను అవి నాకు తెలియవు. చిన్నచిన్న మాటల్లోనే నా భావాన్ని చెప్పడానికి
ప్రయత్నిస్తా.
ప్రశ్న: తెలుగులో ఎలా
రాస్తారు?
ప్రశ్న: English లో రాయొచ్చు కదా, మాకు తెలుగు చదవడం రాదు.
జవాబు: తెలుగు భాష మీదున్న పట్టుని
కాపాడుకోవడానికని బ్లాగింగు చేస్తున్నా, మళ్ళీ Englishఆ? అయితే
ఇక్కడున్న బ్లాగులన్నింటిని భాషాంతరం చేసి ఇంగ్లీషులో మరో బ్లాగులో ప్రచురించాలనే
ఆలోచన ఉంది. అది ఎప్పుడు చేస్తానో మాత్రం చెప్పలేను.
No comments:
Post a Comment