Computer
అంటే Windows ఆ? ఈ ప్రపంచంలో చాలా మందికి computerతో
పని చెయ్యడం అంటే Windowsమీద Internet Browser లేదా Microsoft officeలతో పనిచేయడం మాత్రమే. ఈనాటి ప్రపంచంలో చాలా
మందికి computer అంటే కేవలం Windows
మాత్రమే. కంప్యూటర్
అంటే Windows కాదు, Windows కేవలం
ఒక operating system మాత్రమే, ఇలాంటి operating systemలు ఎన్నో ఉన్నాయి అని తెలిసింది ఎందరు? కేవలం
Techies మాత్రమే.
Windows-95 operating
system ద్వారా Graphical
User Interfaceతో ఒక విప్లవాత్మక మార్పుని
తీసుకొచ్చి, సామాన్యుడికి కూడా computerని అందించిన ఘనత
Windowsది. Windows కనుక లేకుంటే ఈనాటికి
సామాన్యుడికి computer అనేది ఒక మేధావుల
యంత్రంగానే ఉండేదేమో మిగిలిపోయేదేమో. కానీ దాన్ని
సామాన్యుల యంత్రంగా మార్చింది Windows, Windows-95 ద్వారా. అప్పటి నుండీ ఇప్పటివరకు, అంటే దాదాపు ఇరవై సంవత్సరాల పాటు విండోస్‌దే
ఏకచక్రాదిపత్యం. అయితే ఇంత ఘన చరితగల
Windows తెరమరుగవనుందా?
ఇంట్లో
ఏదో చిన్న చిన్న పనులకు
computer వాడే వాళ్ళకు ఇంత
పెద్ద Windows operating
System ఎందుకు అని నేను చాలాసార్లు
అనుకునే వాన్ని. కానీ వేరే మార్గం లేదు, ఉన్నది
windows ఒక్కటే, దాన్నేవాడుకోవాలి. నా దగ్గర Truck
మాత్రమే ఉంటే పక్క వీధికి
వెళ్ళడానికి కూడా దాన్నే వాడాలి
అన్న చందంగా అన్ని పనులకూ Windowsనే
వాడాలి. దానికోసం బోలెడు RAM కావాలి, బోలెడు memory కావాలి, మంచి processor కావాలి.
అయినా ఇంతకాలం ఇవ్వన్నీ ఇంతకాలం Windows ఎదుగుదలకు ఎప్పుడు ఆటంకం కాలేదు. కానీ
మారుతున్న పరిస్తితులకు అనుగుణంగా మారలేని Windows ఎంతకాలం ఇలా మనగలుగుతుంది.
నిన్నటివరకు
computer అంటే ఒక PC లేదా ఒక Laptop. కానీ నేడు PC, Laptop
అనేవి ఒక గతం, అవి గతకాలానికి గుర్తుగా మిగిలిపోయినా ఆశ్చర్యపోనవసరంలేదు. నేటి ప్రపంచం
smartphone & tablet లది. ఒక Techie చేయాల్సిన పనులకు Tablet సరిపోకపోయినా, సాధారణ
ప్రజల రోజూవారి వాడకానికి Tablet సరిపోతుంది. Tabletతో Laptop ఎంతకాలం పోటీగా నిలవగలదు
అంటే, ఎక్కువకాలం నిలవలేదేమో అనిపిస్తుంది నాకు. సాధారణ ప్రజల వాడకంలో laptop కన్నా
Tablet పెరిగిపోతుందన్నది మన కంటికి కనిపిస్తున్న నిజం. అలా అని రేపే Laptop వాడకం
ఆగిపోతుందని నేను అనడం లేదు కానీ సమీప భవిష్యత్తులో ఇది జరగడం మాత్రం తధ్యం.
Laptop వాడకం తగ్గిపోతే దానితో పాటు Windows వాడకం తగ్గిపోయినట్టే. రేపటితరం సాధనాలయిన
Tablet, Smartphobeలలో ఎక్కవ RAM, memory, processing speed ఉండవు, వాటిలో సాధారణ Windows
నడవదు, కనుక వాటికి ప్రత్యేక OS కావాలి. Tablet, Smartphobeల operating systemsలో Windows
అతి దారుణంగా వెనకబడిపోయింది. Windows Phone, Windows RT వినియోగదారుల్ని సంతృప్తి
పరచడంలో అతి దారుణంగా విఫలమయ్యాయి. అంతేకాదు Windows-8 కూడా ఒక చెత్తా operating
systemగా పేరు తెచ్చుకుంది. Windows పరిస్తితి ఎంత దారుణంగా ఉందంటే ఒక
mobile/tablet కొనడానికి వెళితే కొట్టువాడే Windows Phone వద్దు అని చెబుతున్నాడు.
మరోవైపు ప్రత్యర్ధుల operating systems అయిన Android, iOSలు పోటీలో దూసుకెళ్ళిపోతున్నాయి.
ఇప్పటివరకు Mobile/Tablet operating systems పోటీలో లేని Windows, ఈ పోటీలో ఎప్పుడు
చేరుతుంది? అప్పటివరకు ప్రత్యర్ధులు ఎంతముందుకు దూసుకెళ్ళిపోతారు? ఆలస్యంగా పోటీలో
చేరి అప్పటికే దూసుకెళుతున్న ప్రత్యర్ధులకు పోటీ ఇవ్వగలదా? మనం ఇక్కడ ఇంకో విషయం గమనించాలి,
mobile device operating systems జనాంగీకారం పొందడానికి అతిముఖ్యమైనవి mobile
apps. Mobile appsలో ఇప్పటికే Windows వెనకబడిపోయింది. కొత్త operating system తయారు
చేసేనాటికి ఉండే mobile appsకు windows supportరావడానికి ఎంత సమయం పడుతుంది అన్నది
Windows జయాపజయాల్ని నిర్ణయిస్తుంది.
అలా
అని నేనుWindows పూర్తిగా
కనుమరుగయిపోతుంది అనడంలేదు. Windows పరిభాషలోనే చెబితే దాని వినియోగదారులు మూడు
రకాలు. వారి అవసరానికి అనుగుణంగా
Windowsలో మూడు రకాలున్నాయి. Windows Home, Windows Professional, Windows Server.
మొదటి వర్గంలో ఉన్న సామాన్య వినియోగదారులు Windows Homeని వాడతారు, వీరు ఎక్కువగా వాడేది
Browser & Microsoft Office. వీరంతా రానున్న కాలంలో Tabletకి మారిపోవడం తధ్యం.
అంటే Windows Home వినియోగం ఆగిపోయినట్టే. ఇక రెండో వర్గం వారు Techies,
developers, architects, managers. వీళ్ళు Lappyనుండి Tabletకి మారలేరు, వీళ్ళకు కావలసిన
పనులు Tabletలో జరగవు, కనుక వీళ్ళకు Windows operating system తప్పదు. ఈ వర్గంలో
Windows కొంతకాలం ఉంటుంది. అయితే ఎంతకాలం ఉంటుందో చెప్పలేం, Tabletsలలోకూడా RAM,
memory, processing రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈనాడు Laptopలో చెయ్యగల ప్రతిపని
భవిష్యత్తులో Tabletలో చేయగలిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. మూడవ వర్గం servers. ఈ వర్గంలో
Windows ఇప్పటికే వెనకబడిపోయింది. Server కోసం Linux లాంటి operating systems వైపు
మొగ్గుచూపిస్తారు, Windowsని పెద్దగా ఇష్టపడరు. మరి భవిష్యత్తంతా cloud based
serversదే అయినప్పుడు cloudలో Windowsను ఎవరు ఎందుకు వాడతారు? అంటే ఈ వర్గంలో కూడా
Windows దాదాపుగా ముగిసిపోయినట్టే.
రేపటి
mobile devices విపణిలో నిలవాలంటే ముందుగా Windows OS Architectureను సమూలంగా
మార్చి, వాటి అవసరాలకు అనుగుణంగా Re-architect చేయాలి. ఇంతాచేసినా Windows పోటీలో నిలవగలదా
అంటే ఇదమిద్దంగా సమాధానం చెప్పలేము. ఇన్నాళ్ళూ PC/Laptop విపణిలో Windowsది ఏకచక్రాధిపత్యం. Apple OS X,
Google Chrome లాంటి operating systems ఉన్నా అవి చెప్పుకోదగ్గ పోటీ ఇవ్వలేకపోయాయి.
పోటీయే లేని విపణిలో రారాజుగా వెలిగింది Windows. కానీ ప్రస్తుత పరిస్తితులు వేరు,
ప్రత్యర్ధులైన Android, iOSలు ముందంజలో ఉన్నాయి. దానికితోడు Windows Phone,
Windows RTలు వినియోగదారుల్లో Windowsకి చెడ్డపేరు తెచ్చిపెట్టాయి. ఇలాంటి పరిస్తితుల్లో
Windows నిజంగా పోటీలో నిలవగలదా? వినియోగదారుల్ని Windowsవైపు ఆకర్షించే ప్రత్యేకతలు
చూపగలదా?
Windows
భవిష్యత్తు అంతా నిరాశాజనకమేనా? ఆశాజనకమైన విషయాలే లేవా అంటే ఉన్నాయి. Nokia, Mocrosoftల మధ్య పొత్తు, Ultrabook లాంటివి.
Nokia, Mocrosoftల మధ్య పొత్తు నిజంగా
Windowsకు విజయాన్ని అందిస్తుందా లేక జోగి జోగి రారుకుంటే రాలేది బూడిదే అన్న చందంగా
మిగిలిపోతుందా అన్న ప్రశ్నకు సమాధానంకోసం మనం వేచి చూడాల్సిందే. Windowsకు మిగిలి ఉన్న
ఒకే ఒక ఆశాకిరణం Ultrabook. Laptop, Tabletల సంకరంగా రాబోతుంది ఈ Ultrabook. ఇప్పటికే
వచ్చిన Ultrabookలు చాలా ఆకర్షనీయంగా కనిపిస్తున్నాయి. Tablet ఆకృతితో Laptop
processing సామర్థ్యంతో వచ్చే ఈ Ultrabook నిజంగా ఓ ఆశాకిరణమే. ఈ Ultrabookకి Intel
(ARM ప్రత్యర్ధి కనుక) మద్దతు కూడా ఉంది. Tablet కన్నా Ultrabook కొనడానికి వినియోగదారులు
మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయన్న విషయం Windowsకు ప్రాణవాయువే. ఇక్కడ కూడా Apple OS
X, Google Chrome, Androidలు పోటీకి వచ్చే అవకాశంలేకపోలేదు. ఏది ఏమయినా భవిష్యత్తు
Windowsకు నల్లేరు మీద నడకమాత్రం కాదు.
అయితే
నాకేంటి? మీకు ఉందోలేదో కానీ నాకు మాత్రం చాలా ఉంది. Windows-NT (& corresponding
Office) నుండి దాచుకున్న data ఎంతో ఉంది. దాన్ని భవిష్యత్తు operating systems
(&corresponding office)లో చూడగలనా లేదా అన్నది చాలా పెద్ద చిక్కు ప్రశ్న. అందుకే
Windows-7, Office 2007ల installer లను దాచుకుంటున్నా భవిష్యత్తులో అవసరమొస్తాయేమో
అని. అలాగే భవిష్యత్తులో collegeనుండి బయటికొచ్చే విద్యార్థులు .Net technologyలకు
దూరంగా ఉండటం మంచిదేమో అని నా అభిప్రాయం.